ఆర్ఆర్ఆర్‌లో ఆ ఫీట్ చేసేది తారక్ కాదు చరణ్‌?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండంతో టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇక ఉగాది కానుకగా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ వీడియో చూస్తే ఓ అనుమానం అందరిలో మొదలైంది.

గతంలో ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తాడనే వార్తలు వినిపించాయి.

అయితే చరణ్ ఫస్ట్ లుక్ వీడియో చూస్తే ఈ సినిమాలో చరణ్ మూడు షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఫ్లాష్‌బ్యాక్‌ అల్లూరి సీతారామరాజుగా, పోలీస్ పాత్రలో, అలాగే హీరోయిన్‌ను ప్రేమించే పాత్రలో కూడా చరణ్ నటిస్తాడని తెలుస్తోంది.

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంటుందో అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

ఒకవేళ చరణ్ మూడు షేడ్స్‌లో కనిపిస్తే, తారక్ ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటున్న హీరోయిన్స్