గేమ్ ఛేంజర్ మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్.. ఆ సాంగ్ కు బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్.
ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఇప్పుడు అదే ఊపుతో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్( Game Changer ) మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అయితే చరణ్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు మూవీ మేకర్స్.
కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇక ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.
ఈ టీజర్ కు భారీగా స్పందన వచ్చింది.అన్ని భాషల ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సబంధించి ఎప్పటికప్పుడు ఏవో ఒక కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
ఈ నెల 20 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారట మూవీ మేకర్స్.
ఈ సాంగ్ కోసం సుమారుగా 20 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేశారట.
అలాగే ఈ సినిమా సర్ ప్రైజ్ లలో ఒకటి తాజాగా రివిల్ అయ్యింది.
అఫీషియల్ గా మూవీ టీమ్ చెప్పకపోయినా ఈ సినిమాకు చెందిన ఒక న్యూస్ సీక్రేట్ వైరల్ అవుతోంది.
అదేంటంటే.ఈ మూవీలో ఒక సన్నివేశంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పాటకు( Pawan Kalyan Song ) డ్యాన్స్ చేస్తాడట.
ఈ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుందని సమాచారం.