చరణ్ ట్రిపుల్ ధమాకా కోసం సిద్ధంగా ఉండండి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి ట్రిపుల్ ట్రీట్ అందనుంది.ఈయన నటించిన మూడు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ తో ఈ ఏడాది లోనే విడుదల కానున్నాయి.

ఈ విషయాన్నీ దిల్ రాజు మెగా అభిమానులకు చెప్పి వారిని సంతోష పరిచాడు.

నిన్న రాత్రి కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.

నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు.

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ తేజ్ వచ్చారు.ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ చరణ్ సినిమాల గురించి ఒక ఎగ్జైటింగ్ వార్తను మెగా అభిమానులకు షేర్ చేయడంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.''రామ్ చరణ్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఏడాది గ్యాప్ లో చరణ్ నుండి మూడు కొత్త థియేట్రికల్ రిలీజ్ లు ఉండనున్నాయి.

ట్రిపుల్ ఆర్, ఆచార్య, ఆర్సీ15.ఈ మూడు సినిమాలు కూడా ఏడాది గ్యాప్ లోనే రిలీజ్ అవ్వనున్నాయి.

చరణ్ నుండి కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ మూవీస్ కోసం సిద్ధంగా ఉండండి'' అంటూ దిల్ రాజు తెలిపారు.

"""/" / రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ ఏప్రిల్ 28న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఆ తర్వాత ఆచార్య ఈ ఏడాది చివరి లోనే రాబోతుంది.ఈ రెండిండికి భిన్నంగా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆర్ సి 15 సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ గా నటిస్తున్నాడు.

కియారా అద్వానీ చరణ్ కు జోడీగా కనిపిస్తుంది.ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

 .

మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…