వైరల్ అవుతున్న రామ్ చరణ్ లుంగీ ఫొటోస్... మామూలుగా లేదుగా...
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.
ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, అలియా భట్, కిచ్చ సుదీప్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఇందులో రామ్ చరణ్ తేజ్ లుంగీ కట్టుకుని మెడలో రుద్రాక్ష మాలలు వేసుకొని కండలు తిరిగిన యువకుడిలా కనిపిస్తున్నాడు.
అయితే ఈ గెటప్ కొంతమేర అప్పట్లో స్వాతంత్య్రం కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు గెటప్ ని పోలి ఉంటుంది.
దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్ ఫోటోలని సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలు జక్కన్న దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్.
ఆర్ చిత్రంలోని రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ఫోటోలు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.అయితే రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండటంతో కొందరు నిజమే నమ్ముతున్నారు.
"""/"/
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయాల్సి ఉంది.
కానీ చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే చిత్రం రావడం ఆలస్యం అవుతున్నప్పటికీ ఇలా లీకైన ఫోటోలు వీడియోలతో ఇటు మెగా అభిమానులు నందమూరి అభిమానులు సంతృప్తి పడుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి13, సోమవారం 2025