ఆర్సీ 15 రిలీజ్ డేట్ ఫిక్స్.. షూటింగే పూర్తికాని సినిమాకు సీటు రిజర్వ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం RRR.

అన్ని అనుకూలించి ఉంటే ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల పై ఫోకస్ పెట్టారు.

ఇలా రామ్ చరణ్ దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్రం మ్యూజిక్ ఈవెంట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.

చరణ్ ఈ సంక్రాంతికి రాకపోయినా వచ్చే సంక్రాంతికి తప్పకుండా వస్తాడని తన నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా గురించి ప్రకటించారు.

"""/"/ దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలతో వచ్చే సంక్రాంతికి బడా నిర్మాత తన బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అదేవిధంగా ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ