గేమ్ చేంజర్ సినిమాలో ఇదే హైలెట్…

సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్ శంకర్( Director Shankar ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనింలేదు.

ఆయన చేసిన ప్రతి సినిమా కూడా భారీ స్థాయి లో ఉంటుంది సెట్టింగ్ లు గానీ, సాంగ్స్ గానీ, ఫైట్స్ గానీ ప్రతిదీ చాలా రిచ్ గా తీయాలి అనుకునే డైరెక్టర్ కావడం వల్ల శంకర్ కి ఇండస్ట్రీ లో చాలా పెద్ద డైరెక్టర్ అనే పేరు అయితే వచ్చింది అయితే శంకర్ డబ్బులు పెట్టించిన కూడా అంతకు అంత వసూలు చేస్తాడు అందుకే ఆయనంటే ప్రొడ్యూసర్లకి కూడా అంత నమ్మకం ఉంటుంది.

ఇక ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ తో గేమ్ చెంజర్( Game Changer Movie ) అనే సినిమా చేస్తున్నాడు ఇక అలాగే కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.

నిజానికి ఇండియన్ 2 సినిమా ముందే స్టార్ట్ చేసాడు కానీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య విభేదాలు రావడం తో ఈ సినిమా ను మధ్యలోనే ఆపేశారు ఇక దాంతో శంకర్ రామ్ చరణ్ తో ( Ram Charan ) తన నెక్స్ట్ సినిమా ను స్టార్ట్ చేశారు.

ఎందుకంటే అనుకోకుండా ఇండియన్ 2 సినిమా ఆగిపోవడంతో వెంటనే గేమ్ ఛేంజర్ సినిమా ని మొదలుపెట్టడం జరిగింది.

ఇక ఈ క్రమం లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో మళ్ళీ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేయాలని ప్రొడ్యూసర్లు డైరెక్టర్ ని కోరగా ఆ విషయం కోర్ట్ దాకా వెళ్లింది.

ఇక దాంతో చేసేది ఏమి లేక శంకర్ అటు గేమ్ చేంజర్ ఇటు ఇండియన్ 2( Indian 2 ) రెండు సినిమాలు చేస్తున్నాడు.

"""/" / అయితే ఎప్పుడో మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.

ఇక తర్వాత 2024 మార్చిలో గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేయాలని ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.

కానీ అది ఇప్పుడు సాధ్య పడడం లేదని తెలుస్తోంది.ఇప్పుడు గేమ్ చెంజర్ ముందుకు రాగా మళ్లీ ఇండియన్ 2 వెనక్కి వెళుతున్నట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన CG వర్క్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందట.

అందుకే ఈ సినిమాను 2024 దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఇక సమ్మర్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

"""/" / నిజానికి శంకర్ సినిమా అంటేనే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అందులో గ్రాఫిక్స్ వర్క్( Graphics Work ) ఎక్కువ గా ఉండటం వల్ల అవి తొందరగా పూర్తి అవ్వవు కాబట్టి ఇలా లేటు అవుతూ ఉంటుంది.

అయితే ఈ రెండు సినిమాలతో శంకర్ మరోసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారబోతున్నాడు అంటూ ఇప్పటికే చాలా కామెంట్లు వస్తున్నాయి.

గేమ్ చెంజర్ సినిమాలో ఒక ఫైట్ ఎపిసోడ్ అయితే అద్బుతం గా ఉంటుందట.

దానికోసం చాలా కష్టపడ్డరట అది చూస్తే నిజంగా ప్రేక్షకులు శంకర్ మేకింగ్ కి దండం పెట్టకుండా ఉండలేరు అని చిత్ర యూనిట్ చెప్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్ తో ఇలా చేశారంటే ఏజ్ పెరిగిన యవ్వనంగా మెరిసిపోతారు!