అది తలుచుకుంటే కాళ్ళు వణుకుతాయి.. రామ్ చరణ్ వైరల్ కామెంట్స్?
TeluguStop.com
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు ఎంపిక అయిన సందర్భంగా ఆదివారం జరగబోయే ఆస్కార్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే.
గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ అక్కడే ఉంటున్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్కడ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోని తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సందర్భంగా నాటు నాటు పాట సాధించిన ఘనత గురించి, దర్శకుడు రాజమౌళి కలిసి పని చేయటం తనకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో అన్న విషయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
"""/" /
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.నాటు నాటు సాంగ్ కేవలం ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట మాత్రమే కాదు.
ఇది అందరి పాట.ప్రజలందరూ మెచ్చిన పాట.
భిన్న సంస్కృతులకు చెందిన వేర్వేరు వయసులకు చెందినవారు పాటలోని సాహిత్యం అర్థం కానప్పటికీ తమ పాటగా స్వీకరించారు అని గొప్పగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
జపాన్ నుంచి యు.ఎస్ వరకు ప్రతీ ఒక్కరూ ఈ పాటను ఎంతో ఇష్టపడ్డారు.
దీనిని మూడవ వ్యక్తిగా నేను గమనిస్తూనే ఉన్నాను.ఇది ఎవరూ కాదనలేని నిజం.
ఇంత కంటే గొప్పగా ఏదీ కోరుకోను అని సంతోషంగా వ్యక్తం చేశారు చెర్రీ.
అలాగే ఉక్రెయిన్ లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు నాటు నాటు పాటను రిహార్సల్ చేశాం.
అక్కడి ప్రెసిడెంట్ కూడా ఓ నటుడే. """/" /
దాంతో ఆయన అక్కడ షూటింగ్ చేసుకుంటామనే మా అభ్యర్థనను మన్నించారు.
పాట చిత్రీకరణలో 15 మంది డాన్సర్స్ సెట్‌లో పాల్గొన్నారు.వారితో పాటు 200 మంది యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు.
ఇక నాటు నాటు పాటను చిత్రీకరించటానికి 17 రోజుల సమయం పట్టింది.డాన్స్ చేసే క్రమంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం.
నేనైతే నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను అని తెలిపాడు చరణ్. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వణుకుతాయి నేను రాజమౌళిగారితో ఎప్పుడు పని చేసిన నా బ్రెయిన్‌ని స్విచ్ ఆఫ్ మోడ్‌లో పెట్టేసుకుంటాను.
ఎందుకంటే ఆయన మనసులో ఏముందో మనం ఊహించలేం.అలాగే ఆయన పనిలో ఆయన చాలా నిష్ణాతుడు.
ఓ టెక్నీషియన్‌గా తనకేం కావాలో బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
రూ.82,000 జీతం కూడా చాలకపోతే.. మధ్య తరగతి బతుకు ఎలా గడవాలి.. ఈయన ఆవేదన ప్రతి ఒక్కరిదీ!