బాబాయి నిజ జీవితం లోని పాత్ర చేస్తున్న అబ్బాయి…

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి చెప్పాలంటే ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.

అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సినిమా కి కోట్ల రూపాయల రెమ్యున్ రేషన్ అందుతుంది.

అయినప్పటికీ ఆయన అవన్నీ వదిలేసి జనాలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు.అయితే ఇక ఈ రాబోయే ఎలక్షన్స్ లో గెలిచి జనాలకి సేవ చేయాలని చూస్తున్నారు.

ఇక ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ రామ్ చరణ్( Ram Charan ) చేస్తున్న గేమ్ చెంజర్ మూవీలో( Game Changer Movie ) రామ్ చరణ్ పాత్ర నిజ జీవితపు పవన్ కళ్యాణ్ ని పోలి ఉంటుందని తెలుస్తుంది.

ఇక శంకర్ చరణ్ కాంబో లో వచ్చే ఈ గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించే చరణ్ పాత్ర పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది.

చరణ్ పాత్రను చూస్తున్నంత సేపు అభిమానులకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరణ్ రోల్ వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. """/" / సినిమాను 2024 ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తే బాగుంటుందని అలా రిలీజ్ చేస్తే ఈ సినిమాకు కూడా కచ్చితంగా ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

"""/" / గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ రామ్ చరణ్ కెరీర్ ను సైతం ఛేంజ్ చేస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

వరుస ప్రాజెక్ట్ లతో రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

కాలువలో భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు.. వీడియో చూస్తే గుండె ఆగుద్ది!