బాబాయ్ వల్ల నాన్న బెల్ట్ తో కొట్టారు.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తాజాగా చాలా నటించిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య బాబు షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఫుల్ ఎపిసోడ్ ని ఆహా విడుదల చేసింది.ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే బాలయ్య బాబుతో( Balayya Babu ) ముచ్చటించిన రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలు సినిమాలకు సంబంధించిన విషయాలు తన భార్య కూతురు ఫ్యామిలీకి సంబంధించిన అనేక అంశాల గురించి స్పందించారు.

ఈ క్రమంలో మీ డాడీ నిన్ను ఎప్పుడైనా కొట్టాడా అని బాలయ్య బాబు ప్రశ్నించగా రామ్ చరణ్ స్పందిస్తూ.

"""/" / నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా ఒకే ఒకసారి డాడీ కొట్టారు నాగబాబు( Nagababu ) బాబాయ్ వల్ల.

ఒకరోజు నేను బయట కూర్చున్నాను.బయట ఇద్దరు కొట్టుకుంటున్నారు.

వాళ్ళు వేరే భాషలో బూతులు మాట్లాడుకుంటూ కొట్టుకున్నారు.నాకు ఆ భాష అర్ధం కాలేదు, అవి భూతులు అని తెలీదు.

ఇంట్లోకొచ్చి వాళ్ళు మాట్లాడుకున్న వర్డ్స్ నాగబాబు బాబాయ్ తో అన్నా.దాంతో బాబాయ్ నన్ను డాడీ దగ్గరకు తీసుకెళ్లి డాడీ పడుకుంటే లేపి మరీ ఈ పదాలు మాట్లాడుతున్నాడు అని చెప్పారు.

ఎందుకు మాట్లాడాడు, ఎక్కడ నేర్చుకున్నాడు అని అడక్కుండానే బీరువాలో మా తాతయ్య పోలీస్ బెల్ట్ ఉంటే తీసి కొట్టారు డాడీ.

"""/" / తర్వాత వాడికి అసలు వాటి అర్ధం కూడా తెలీదు కదా అని మళ్ళీ వాళ్ళే అన్నారు అని తెలిపాడు.

అదొక్కసారే డాడీ కొట్టారు.తర్వాత మళ్ళీ ఎప్పుడూ కొట్టలేదు.

నాగబాబు బాబాయ్ వల్లే కొట్టారు అని నవ్వుతూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే రామ్ చరణ్ నటించిన సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రేపు అనగా జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.రామ్ చరణ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత సోలోగా నటించిన సినిమా కావడం అలాగే పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!