ఆ విషయంలో తండ్రి చెప్పిన సలహా బయటపెట్టిన రామ్ చరణ్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

ఇందులో రామ్ చరణ్ తో పాటు మరొక స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా రిలీజ్ అవ్వడానికి మరికొన్ని రోజులు సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంకా పలు రకాల భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా చెన్నై లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.

తన తండ్రి చిరంజీవి తనకు ఇచ్చిన ఒక ఉత్తమ సలహా గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.జీవితంలో క్రమశిక్షణ ఉంటే కెరీర్ సుదీర్ఘకాలం అద్భుతంగా ఉంటుంది అని తండ్రి తనకు సూచించాడని తెలిపారు.

సిని ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణంఎలా కొనసాగించాలో తెలిపేందుకు నాకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ఫూర్తి అని తెలిపారు.

వయసుతో సంబంధం లేకుండా ఎనర్జిటిక్ గా, ఫిట్ గా ఉంటూ సక్సెస్​ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న అక్షయ్ కుమార్ నే తాను ఫాలో అవుతున్నాను అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

"""/" / ఈ యువ హీరో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

రామ్ చరణ్ తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా పై చరణ్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024