‘RC15’ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.. ఆ విషయం చరణ్ కు ప్లస్ అయ్యేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా మావెరిక్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'RC15'.

ట్రిపుల్ ఆర్ తర్వాత ఇదే విజయాన్ని కంటిన్యూ చేయడానికి చరణ్ శతవిధాలా కృషి చేస్తున్నాడు.

అందుకే ఎక్కడ తగ్గకుండా తన 15వ సినిమాను పూర్తి చేస్తున్నాడు.చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా ఒక పాత్ర అయితే అల్ట్రా స్టైలిష్ లుక్ లో మరో పాత్ర అని తెలుస్తుంది.

చరణ్ ను శంకర్ డిఫరెంట్ లుక్స్ తో చూపించ బోతున్నాడు.అందుకే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఇంకా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు.అయితే ఈ నెలలో చరణ్ పుట్టిన రోజు ఉండడంతో ఈసారైనా సర్ప్రైజ్ ఉంటుందేమో అని ఎదురు చూస్తున్నారు.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో ప్రారంభ స్లాట్ ను ఆక్రమించే అవకాశం ఉందట.

ఈ సినిమా కోసం 10 జనవరిని ఫిక్స్ చేసుకున్నారు అని అంటే ప్రభాస్ ప్రాజెక్ట్ కే కంటే రెండు రోజులు ముందుగానే ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రాజెక్ట్ కే(Project K) 12 జనవరికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. """/" / మరి ప్రభాస్ కంటే చరణ్ ముందుగానే రావడం ఈయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

సంక్రాంతి కంటే ముందుగానే చరణ్ సినిమా వస్తే సంక్రాంతి పూర్తి అయ్యే వరకు సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి.

మరి ఇది అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.

తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.