'ఆర్‌ఆర్‌ఆర్‌' ఇద్దరు హీరోల టీజర్‌ పై క్రేజీ అప్డేట్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పై అంచనాలు ఆల్ ఇండియా రేంజ్ లో ఉన్నాయి.

హీరోలు పెద్దగా అక్కడ గుర్తింపు లేకున్నా కూడా రాజమౌళికి ఉన్న గుర్తింపుతో ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి స మయంలో ఈ సినిమా టీజర్ గురించిన ఇంట్రెస్టింగ్‌ ప్రచారం మొదలు అయ్యింది.

ఇప్పటి వరకు రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లను విడి విడిగా చూపిస్తూ వచ్చిన రాజమౌళి మొదటి సారి ఒక బైక్ పై ఇద్దరు కూర్చుని వస్తున్న ఫొటోను వదిలాడు.

ఈ ఫొటో త్వరలో టీజర్‌ వస్తుందని చెప్పకనే చెబుతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జులై నెల రానే వచ్చేసింది.ఇక ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది.

ఆ రోజున ఆర్‌ ఆర్‌ ఆర్‌ స్పెషల్‌ ట్రీట్‌ అదే అంటూ వార్తలు వస్తున్నాయి.

"""/"/ విశ్వసనీయంగా అందుతున్న ఆర్ ఆర్‌ ఆర్ సమాచారం ప్రకారం ఆగస్టు 14వ తారీకున ఈ సినిమా లోని ఇద్దరు హీరోలతో టీజర్‌ రాబోతుంది.

ఈ టీజర్‌ అన్ని భాషలకు ఒకటే ఉంటుందని అంటున్నారు.అన్ని భాషలకు కూడా ఒక్కటే టీజర్‌ ఉండటం వల్ల వ్యూస్‌ సంఖ్య కేజీఎఫ్‌ 2 ను మించి ఉంటుందని అంటున్నారు.

డైలాగ్స్‌ ఏమీ లేకుండానే టీజర్ ను విడుదల చేస్తారట.ఈ సినిమా లోని యాక్షన్‌ సన్నివేశాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

కనుక యాక్షన్‌ సీక్వెన్స్‌ నే టీజర్ మరియు ప్రమోషనల్‌ వీడియోలో వేసే అవకాశం ఉంది.

కనుక ఆగస్టు 15న రాబోతున్న సర్‌ ప్రైజ్ అదే అయ్యి ఉంటుందని అంటున్నారు.

రాజమౌళి ఈ సినిమా తో ఇంటర్నేషనల్‌ రేంజ్ డైరెక్టర్‌ గా మారడం ఖాయం అంటున్నారు.

కనుక ఈ సినిమాను ఇంగ్లీష్‌ లో కూడా విడుదల చేయబోతున్నారు.వచ్చే రిపబ్లిక్ డే కు సినిమా ను విడుదల చేసేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడట.

రుషికొండ భవనాలపై తీవ్ర విమర్శలు.. వైసీపీ సమాధానం ఇదే