ఎన్టీఆర్ కు విషెస్ చెప్పిన సింగర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తోటి స్టార్ హీరోలు అవాక్కయ్యేలా భవిష్యత్ ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అల్లూరి సీతారామరాజు రూపంలో ఉన్న చరణ్ లుక్ ను విడుదల చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చరణ్ కు సంబంధించిన లుక్ ను షేర్ చేయడంతో పాటు చరణ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

అయితే ప్రముఖ సింగర్ దలేర్ మెంది ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటోలో చరణ్ ను గుర్తుపట్టకుండా అందులో ఎన్టీఆరే ఉన్నారని భావించారు.

"""/"/ దలేర్ జూనియర్ ఎన్టీఆర్ కు అభినందనలు చెప్పడంతో పాటు పోస్టర్ ఎంతో బాగుందని పేర్కొన్నారు.

చరణ్ ను దలేర్ తారక్ గా భావించడంతో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

చరణ్ పోస్టర్ కు తారక్ కు అభినందనలు చెప్పడం ఏమిటని కొందను నెటిజన్లు ప్రశ్నిస్తుంటే దలేర్ కు ఎన్టీఆర్ కు, చరణ్ కు తేడా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చేసే పోస్టుల విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్త వహిస్తే మంచిది.

రామరాజు పాత్రలో చరణ్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భీమ్ పాత్రలో తారక్ లుక్ గురించి అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.

మే నెలలో కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ నుంచి రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మొటిమలు మచ్చలుగా మారి ముఖంపై అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఈ హోమ్ మేడ్ టోనర్ వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతమైనట్లే!