రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ రివ్యూ.. నానికి మాత్రం చరణ్ భారీ షాక్ ఇచ్చాడుగా!

రామ్ చరణ్( Ram Charan ) బుచ్చిబాబు( Buchibabu ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై( Peddi Movie ) ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

చరణ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వాస్తవానికి ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

ఈరోజు విడుదలైన పెద్ది గ్లింప్స్( Peddi Glimpse ) మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో కామన్ మ్యాన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పుడతామా ఏంటి మళ్లీ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. """/" / ఈ గ్లింప్స్ కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ గ్లింప్స్ ఉంది.

రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ఉత్తరాంధ్ర యాసలో చరణ్ మెప్పించారు.

రఫ్ లుక్ లో చరణ్ బాగున్నారు.అయితే నానికి( Nani ) మాత్రం చరణ్ ఒకింత భారీ షాక్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / 2026 సంవత్సరం మార్చి 26వ తేదీన ది ప్యారడైజ్( The Paradise ) మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమాతో పోటీ నుంచి తప్పుకుంటుందేమో చూడాలి.

పెద్ది సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తాడో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ ఒకింత వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చరణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది.