22 ఏళ్ల క్రితం చరణ్ ఎలా ఉన్నాడో చూశారా.. అస్సలు గుర్తుపట్టలేమంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతూనే తండ్రికి తగ్గ తనయుడిగా పాపులారిటీని మరింత పెంచుకుంటున్నారు.
చిరుత సినిమాతో హీరోగా చరణ్ కెరీర్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రామ్ చరణ్ తండ్రిని మించి కెరీర్ లో సక్సెస్ అయ్యారని మూడు ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే 22 సంవత్సరాల క్రితం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు రామ్ చరణ్ ఈ వీడియోలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.
యాక్టింగ్ క్లాసులకు వెళ్లే సమయంలో శ్రియ, చరణ్ కలిసి సీన్ ప్రాక్టీస్ చేస్తుండగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
"""/"/
రామ్ చరణ్ జుట్టు పెంచి మీసాలు లేకుండా భలే ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు.
అప్పటికీ ఇప్పటికీ రామ్ చరణ్ లుక్ పూర్తిస్థాయిలో మారిపోయింది.వీడియోలో చరణ్ ఇంగ్లీష్ లో మాట్లాడిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చరణ్ చాలా టాలెంటెడ్ అని టాకెటివ్ అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. """/"/
మొదట ఈ సినిమా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని వినిపించినా ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతోంది.
దిల్ రాజు ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!