ఏదో బ్లాస్ట్‌ ప్రకటన చేయబోతున్న 'ఆర్ఆర్ఆర్‌' టీమ్!!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ దసరాకు అంటే వచ్చే నెలలో సినిమా విడుదల అయ్యి ఉండేది.

కాని సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి అంతా సిద్దం అయినా కూడా కరోనా కారణంగా ఉత్తరాదిన థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో పాటు ఇంకా కరోనా భయం ఉన్న కారణంగా చేసేది లేక సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు.

అక్టోబర్ లేదా నవంబర్‌ వరకు వర్క్ మొత్తంను ముగించి ఫస్ట్‌ కాపీని తీసుకోబోతున్నారు.

భారీ అంచనాలున్న ఈ సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో స్పష్టత కోసం అభిమానులు ఇంకా ఇండస్ట్రీ వర్గాల వారు అంతా వెయిట్‌ చేస్తున్నారు.

"""/"/ సినిమా విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు లేదా రేపు అన్నట్లుగా ఆ ప్రకటన ఉంటుంది.

ఆ ప్రకటనలో ఖచ్చితంగా సినిమా విడుదల తేదీకి సంబంధించిన కీలక అప్ డేట్ ఉంటుంది.

వచ్చే ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఉత్తరాదిన మొత్తం పరిస్థితి సాదారనం అవుతుంది.

అక్కడ అక్టోబర్ లో సినిమాలను విడుదల చేసుకోవచ్చు అంటూ ప్రకటించారు.దాంతో ఆర్ ఆర్‌ ఆర్ ను మరింత ఆలస్యం చేయకుండా జనవరిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

భారీ బడ్జెట్‌ అవ్వడం వల్ల వడ్డీలు భారీగా పెరుగుతాయి.ఎంత లాభాలు వచ్చినా కూడా వడ్డీలకే ఎక్కువ పోతుందని అందుకే మరీ ఆలస్యం చేయకుండా జనవరిలో విడుదల చేస్తామని ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పార్టీ కార్యక్రమాలకు వారు దూరం … కేసీఆర్ ఆగ్రహం