నాటునాటు పాట చిత్రీకరణ మూడు నెలలు ఆలస్యం అయ్యి ఉంటే అద్భుతం మిస్ అయ్యేది!
TeluguStop.com
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఏ స్థాయిలో ప్రపంచాన్ని ఉపేస్తుందో అందరికీ తెలిసిందే.
కీరవాణి స్వరపరిచిన ఆ పాట కి ప్రాణం పోసినట్లుగా రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించారు.
సన్నివేశానికి తగ్గట్లుగా ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు పాటను షూట్ చేయడం జరిగింది.
పాటలో ప్రధాన ఆకర్షణ అధ్యక్ష భవనం అంటూ ఎంతో మంది కామెంట్స్ చేయడం జరిగింది.
ప్రస్తుతం నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది.అతి త్వరలోనే ఆ ఒక్క అడుగు పూర్తి చేసుకుని ఆస్కార్ అవార్డుని అందుకోబోతున్న జక్కన్న టీం ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే.
ఆ సందర్భంగా ఒక టాక్ షో లో రామ్ చరణ్ పాల్గొన్నారు. """/" /
ఆ సందర్భంగా నాటు నాటు పాట చిత్రీకరణ గురించిన పలు ఆసక్తికర విషయాలను మాట్లాడడం జరిగింది.
అప్పుడే నాటు నాటు పాట ఉక్రెయిన్ లో చిత్రీకరించబోతున్నాం అనగానే ఆశ్చర్యం అనిపించింది.
అధ్యక్ష భవనం ముందు చిత్రీకరణకు అనుమతిస్తారా అనే అనుమానం కలిగింది, కానీ అధ్యక్షుడు ఓకే చెప్పారు.
దాంతో చిత్రీకరణ పూర్తి చేశాం.చిత్రీకరణ సమయంలో చాలా కష్టపడ్డాం.
చిన్న చిన్న షాట్స్ కోసం కూడా చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చింది.
అప్పుడు కష్టపడ్డాం కనుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం.నాటు నాటు పాట చిత్రీకరణ పూర్తి చేసిన మూడు నెలలకు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టింది.
ఒకవేళ నాటు నాటు సాంగ్ చిత్రీకరణ మూడు నెలలు ఆలస్యమై ఉంటే కచ్చితంగా ఉక్రెయిన్ వంటి అద్భుతమైన ప్రదేశంలో చిత్రీకరించే వీలుండేది కాదని రామ్ చరణ్ పేర్కొన్నాడు.
అందమైన ఉక్రెయిన్ దేశం పై రష్యా యుద్ధానికి దిగడం బాధను కలిగించిందని కూడా ఎంతో మంది సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!