ఆర్ఆర్ఆర్ టీమ్ మీద భారీ కుట్ర జరుగుతోందా..?

మన దేశం యొక్క పేరు ని తెలుగు వాళ్ల సామర్థ్యాన్ని చూపించిన సినిమా ఆర్ ఆర్ ఆర్( RRR ) ఈ సినిమా వాళ్ల దేశ గౌరవం తో పాటు తెలుగు వాళ్ల గౌరవం కూడా చాలా పెరిగింది కానీ వీళ్ళకి మాత్రం అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి అందులో రీసెంట్ గా జరిగింది ఒకటి.

అవార్డ్ ఇస్తామని పిలిచి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాంటిదే.'అమిత్ షాతో( Amith Shah ) భేటీ.

రెడీ అయిపోండి' అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ కు సమాచారం.దీంతో అంతా సిద్ధమయ్యారు.

ఏ దుస్తులు వేసుకోవాలి, ఏం మాట్లాడాలి లాంటివన్నీ ప్రిపేర్ అవుతున్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్( Ram Charan NTR ) అయితే తమ షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చుకున్నారు.

ఏం జరిగిందో తెలీదు కానీ అంతలోనే తూచ్ భేటీ లేదన్నారు.ఇంకెప్పుడైనా చూద్దాం అన్నారు.

ఆస్కార్ అవార్డ్( Oscar Award ) సాధించి, దేశఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ యూనిట్ కు దక్కిన గౌరవం ఇది.

"""/" / ముందుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ తో అమిత్ షా మీటింగ్ అన్నారు.

వాళ్లకు స్పెషల్ సన్మానం అన్నారు.అబ్బెబ్బే.

వాళ్లిద్దర్నే కలిస్తే ఏం బాగుంటుంది, మొత్తం కీలకమైన యూనిట్ సభ్యులందర్నీ కలిసి సన్మానం చేద్దామన్నారు.

ఆ తర్వాత ఆ లిస్ట్ లోంచి కొందర్ని తొలిగించారు.అవార్డ్ గ్రహీతలతో పాటు హీరోలు, దర్శకుడితో భేటీ అన్నారు.

ఇలా 2 రోజులుగా మార్పుచేర్పులు చేసి, ఆఖరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ యూనిట్ కు హ్యాండ్ ఇచ్చారు అమిత్ షా.

దాని బదులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలవకుండా ఉంటే సరిపోయేది.ఇలా ఊరించి, హ్యాండ్ ఇచ్చి అవమానించడం దేనికి.

"""/" / నిజానికి ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఇలాంటి అవమానాలు కొత్త కాదు.

నాటు-నాటు పాటకు ఆస్కార్ రావడంతో దేశం యావత్తు సెలబ్రేట్ చేసుకుంది.దీంతో టీమ్ ను ఘనంగా సత్కరించాలని అంతా సూచించారు.

అయితే 'తెలుగు చిత్ర పరిశ్రమ' పేరిట జరిగిన ఆ సత్కారం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

ప్రస్తుతం టాలీవుడ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ హీరోలెవ్వరూ హాజరుకాలేదు.ఎంత సేపటికీ అందరూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని ట్వీట్ల తో పలకరించారు కానీ డైరెక్ట్ గా మాత్రం కలిసి వాళ్ళకి విషెస్ చెప్పిన వాళ్ళు తక్కువ మందే.

మన వాళ్ళు సాధించిన ఒక గొప్ప కార్యాన్ని మనం సత్కరించుకోకుండా ఉండటం అనేది నిజంగా భాదని కల్గించే అంశం అనే చెప్పాలి.

బోన్ మారోపై ఎన్ఆర్ఐ వైద్యుల సంఘం స్పెషల్ డ్రైవ్ … దాతలను పెంచడమే లక్ష్యం