బాబాయికి అబ్బాయి బర్త్‌ డే విషెష్‌ ఎక్కడ గురూ?

నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సోషల్ మీడియా లో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సెలబ్రిటీలు పోటీపడుతున్నారు.

ఈ నేపథ్యం లో అందరి దృష్టి రామ్ చరణ్ ట్విట్టర్ వాల్ పై పడింది.

ఆయన బాబాయికి బర్త్డే శుభాకాంక్షలు ఎలా తెలియజేశాడు అంటూ చూసేందుకు వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్ తెలియజేయ లేదు.మధ్యాహ్నం సమయం అవుతున్న ఇప్పటి వరకు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చరణ్‌ ట్వీట్ విష్ చేయడం జరిగింది.కానీ రామ్ చరణ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేయకపోవడంతో మెగా అభిమానులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇతర మెగా హీరోల్లో కొందరు కూడా పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంతో అంతా ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు.

"""/"/ సాయంత్రం వరకు అయినా రామ్ చరణ్ తప్పకుండా బాబాయి పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తాడేమో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ విషయం రాంచరణ్ వరకే వెళ్తుందా అనేది చూడాలి.రామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ లో ఏమి బిజీగా లేడు కనుక సాయంత్రం వరకైనా పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి తన అభిమానంను మరియు ప్రేమను చాటుకుంటాడేమో చూడాలి.

చిరంజీవి కాస్త ఎమోషనల్ గా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇక రామ్ చరణ్ ఎలా తెలియజేస్తాడు అనేది వేచి చూడాలి.అసలు చేస్తాడా లేదా అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?