మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత చివరిగా వినయ విదేయ రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఆ సినిమా డిజాస్టర్ అయ్యి మెగా ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచింది.దీని తర్వాత రాజమౌళి భారీ మల్టీ స్టారర్ చిత్రమైన ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది.ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాని జక్కన్న పూర్తి చేసి ఫెస్టివల్ గిఫ్ట్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తో పటు నటిస్తున్న ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాని కన్ఫర్మ్ చేసుకున్నాడు.
జక్కన్న సినిమా నుంచి బయటకి రాగానే త్రివిక్రమ్ తయో తారక్ సెట్స్ కి వెళ్ళిపోతాడు.
మరి రామ్ చరణ్ ఏ దర్శకుడుతో సినిమా చేస్తాడు అనే విషయంలో ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి.
ఫైనల్ విభిన్న చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.
మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత హలో, గ్యాంగ్ లీడర్ సినిమాలతో వరుసగా రెండు ఫ్లాప్ లని విక్రమ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అయిన కూడా ఈ దర్శకుడు టాలెంట్ మీద పెద్ద హీరోలకి మంచి నమ్మకం ఉంది.
ఈ నేపధ్యంలోనే తాజాగా విక్రమ్ కె కుమార్ రామ్ చరణ్ కి కథ చెప్పడం జరిగిందని, ఈ కథ నచ్చడంతో చెర్రీ కూడా అతనితో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.
వెదురు బొంగులతో చేసిన రోలర్ కోస్టర్.. ఇండోనేషియా పిల్లల వీడియో వైరల్!