కన్నడ దర్శకుడితో రామ్ చరణ్..!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత అసలైతే జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉండాల్సి ఉంది.
కానీ ఎందుకో చరణ్ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నాడు.ఇక చరణ్ 16వ సినిమా కన్నడ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
తొలి సినిమాతోనే కన్నడలో సూపర్ హిట్ కొట్టిన నార్తన్ డైరక్షన్ లో చరణ్ 16వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన మఫ్తీ సినిమాని డైరెక్ట్ చేశాడు నార్తన్.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా అతనికి అది మొదటి ప్రయత్నమే.
అయినా సరే తొలి సినిమా దర్శకుడిగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న వాడిగా సినిమా తీసి హిట్ అందుకున్నాడు.
నార్తన్ చరణ్ కి సరిపోయే ఓ కథతో కలిశాడట.నార్తన్, చరణ్ ల మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది.
మరి ఈ కాంబోలో సినిమా ఉంటుందా లేదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది.