Ram Charan: రాజమౌళి వల్ల ఆ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న రామ్ చరణ్..!!

రాజమౌళి వల్ల రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నారా.

అవును ఇది నిజమే అంటున్నారు కొంతమంది ఇండస్ట్రీకి చెందిన జనాలు.మరి రాజమౌళి ఏం చేశారు.

ఆయన వల్ల రామ్ చరణ్ మిస్ చేసుకున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ కోసం దేశ మొత్తమే కాకుండా విదేశాల్లో ఉండే అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ హీరో హీరోయిన్స్ గా వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి.

దాంతో ప్రభాస్ అభిమానులంతా సలార్ (Salaar) సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకి ఇప్పటికే లక్ష డాలర్స్ కి పైగా వచ్చాయని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా విడుదల సమయంలో నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

"""/" / అంతేకాకుండా ప్రీమియర్ షో నుండి మూడు మిలియన్ డాలర్ల వరకు ఈ సినిమా వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు.

అయితే ఇంత పెద్ద భారీ సినిమా సలార్ గురించి ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుకుంటుంటే సోషల్ మీడియాలో ఉన్నట్టుండి ఈ సినిమా గురించి మరొక షాకింగ్ విషయం బయటపడింది.

అదేంటంటే.ఈ సినిమాలో మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదట.

అవును సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.ప్రభాస్ (Prabhas) కంటే ముందే ఈ సినిమా రామ్ చరణ్ దగ్గరికి వెళ్లిందట.

"""/" / ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి సలార్ స్టోరీ చెప్పినప్పుడు సినిమా స్టోరీ చాలా బాగుంది.

కానీ ప్రస్తుతం నేను రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేస్తున్నాను.ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని రామ్ చరణ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.

ఇక ప్రశాంత్ నీల్ కి కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఎన్ని రోజులు టైం పడుతుందో క్లారిటీ లేదు కాబట్టి ప్రభాస్ దగ్గరికి వెళ్లి ఈ సినిమా స్టోరీ చెప్పి ఎట్టకేలకు సలార్ సినిమాని పూర్తి చేశారు.

అయితే ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ రాజమౌళి వల్లే రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అయినా సలార్ లో అవకాశం కోల్పోయారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న సాయిపల్లవి.. ఇకపై డాక్టర్ సాయిపల్లవి అంటూ?