తారక్ చేసిన సాహసం చరణ్ చేస్తాడా..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను చూసేందుకు యావత్ టాలీవుడ్ ఆతృతగా చూస్తోంది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ ఫస్ట్ లుక్ వీడియోలో తారక్ వాయిస్ ఓవర్ మరింత గంభీరంగా ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ వీడియో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు.

అయితే మలయాళం మినహా మిగతా భాషల్లోనూ తారక్ వాయిస్ ఓవర్ అదిరిపోయిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.

అయితే తెలుగుతో పాటు ఇతర భాష్లలోనూ తన సొంత వాయిస్‌తో డబ్బింగ్ చెప్పి పెద్ద రిస్క్ చేశాడు తారక్.

ఇక తారక్‌కు సంబంధించిన కొమురం భీం ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే తారక్‌లా చరణ్ ఇతర భాషల్లో సొంత వాయిస్ ఓవర్ ఇస్తాడా? ఆయన ఇలాంటి రిస్క్ చేస్తాడా? అంటే కాదనే సమాధానం వినిస్తుంది.

మరి ఈ వీడియో రిలీజ్ అయితేగాని చరణ్ రిస్క్ గురించి మనకు తెలుస్తుంది.

హిందీలోకి వెళ్తున్న సంక్రాంతికి వస్తున్నాం… హీరో అతనేనా?