చరణ్, మహేష్ పోటీ పడితే విజేత ఎప్పుడూ ఆ హీరోనేనా.. ఆ హీరోకు భారీ షాకులు తగిలాయిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చరణ్, మహేష్( Ram Charan, Mahesh ) లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ ఇద్దరు హీరోలు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

చరణ్, మహేష్ సినిమాలతో బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.చరణ్, మహేష్ బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో రామ్ చరణ్ పైచేయి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

2013 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో చరణ్ నటించిన నాయక్, మహేష్, వెంకటేశ్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలయ్యాయి.

ఈ రెండు సినిమాలు హిట్ గా నిలిచినా ఈ సినిమాలలో నాయక్ పైచేయి సాధించింది.

రెండు రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి.గోదావరి జిల్లాల్లో మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

"""/" / 2014 సంవత్సరంలో రామ్ చరణ్ ఎవడు( Yevadu) సినిమాతో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.

ఈ సినిమాలో ఎవడు సినిమా పైచేయి సాధించింది.మరోసారి మహేష్ బాబుపై చరణ్ పైచేయి సాధించారు.

అదే ఏడాది ఆగడు, గోవిందుడు అందరివాడేలే( Govindudu Andarivadele ) సినిమాలతో మహేష్ చరణ్ పోటీ పడగా చరణ్ మూవీ పైచేయి సాధించి హిట్ గా నిలిచింది.

"""/" / రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ కాగా రెండు సినిమాలు సక్సెస్ సాధించినా రంగస్థలం సినిమాకు మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి.

మహేష్ తో పోటీ పడిన ప్రతి సందర్భంలో రామ్ చరణ్ కు అనుకూల ఫలితాలు వస్తుండటం గమనార్హం.

రామ్ చరణ్, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మనసంతా నువ్వే దర్శకుడిని ఆ సంస్థ నిజంగానే తొక్కేస్తుందా?