రామ్ చరణ్ లోకేష్ కనక రాజ్ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan ).

ప్రస్తుతం ఈయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న 'గేమ్ చేంజర్' ( Game Changer )సినిమా మీదనే ప్రతి ఒక్కరు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కనకరాజ్ ( Lokesh Kanaka Raj )డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడంటూ వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక ఇప్పటికే ఆయనకు వరుస సినిమాలను కమిట్ అయ్యాడు.ఇక ఇవి పూర్తి అవ్వడానికి కనీసం మూడు సంవత్సరాల సమయం అయిన పడుతుంది.

ఇక అందులో భాగంగానే బుచ్చిబాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమాతో పాటుగా, ఆ సినిమా తర్వాత సుకుమార్ తో కూడా మరొక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా వస్తుందా లేదా ఫ్రెష్ స్టోరీ తో వస్తుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత లోకేష్ కనక రాజ్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.

మరి అప్పటివరకు ఎవరితో సినిమా చేస్తాడో తెలియదు. """/" / అలాగే రామ్ చరణ్ కూడా ఈలోపు ఎవరైనా మంచి కథతో వస్తే వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరి మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ రామ్ చరణ్ కి బాగా నచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మాత్రం ఆయన ఈ సినిమాను చేయలేడు.

కాబట్టి అప్పటివరకు లోకేష్ కనకరాజ్ ఆ కథ పట్టుకొని వెయిట్ చేస్తాడా లేదంటే వేరే హీరోతో చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.

అలాగే రాంచరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

బిగ్‌బాస్‌ని నమ్మి పెద్ద తప్పు చేసిన సోనియా.. ఇప్పుడేదో చేస్తుందట..?