ఆ సూపర్ హిట్ సినిమాను వదిలేసిన రామ్ చరణ్…

ఇండస్ట్రీ లో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు.

సినిమా కంటెంట్ బట్టి సినిమా ఆడుతుంది తప్ప, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వలనో లేదంటే సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టడం వలనో సినిమా అనేది భారీ రేంజ్ లో సక్సెస్ సాధించదు.

అలాగే హీరోలు కూడా మంచి కథలను చేయడానికి ప్రిఫర్ చేయాలి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం చాలా స్టోరీలు వింటున్నాడు.

కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఫైనల్ చేస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ అయినట్టుగా తెలుస్తుంది.

"""/" / ముఖ్యంగా అది ఏంటి అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) ముందుగా సలార్ సినిమా( Salaar Movie ) స్టోరీని రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడట.

ఇక దీనికి చిరంజీవి ( Chiranjeevi ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ మధ్యలో కొన్ని అనువార్యమైన సంఘటనలు జరగడం వల్ల రామ్ చరణ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ ను( Prabhas ) హీరోగా పెట్టి చేసి ప్రశాంత్ నీల్ తన సత్తా ఏంటో చూపించాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక అదే ఉత్సాహంతో ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఇక ఈ సంవత్సరం కూడా రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

"""/" / మొత్తానికైతే రామ్ చరణ్ సలార్ సినిమాని మిస్ చేసుకొని ఒక పెద్ద తప్పు చేశాడనే చెప్పాలి.

అయితే రామ్ చరణ్ ఆ సినిమాను వదులు కోవడానికి మరో కారణం శంకర్ అని కూడా చెప్పాలి.

ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) సినిమా కోసం కేటాయించిన డేట్స్ ని వాడుకోగా ఇంకా కొన్ని ఎక్కువ డేట్స్ కావాలని శంకర్ చెప్పడంతో తను ఏం చేయలేక సలార్ సినిమాను రిజెక్ట్ చేశాడట.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభాశాలి.. కొరియోగ్రాఫర్ కామెంట్స్ వైరల్!