Ram Charan: రామ్ చరణ్ కి తండ్రి ప్రాణం కంటే డబ్బే ఇంపార్టెంటా.. జ్వరం వచ్చినా కూడా డబ్బు కోసం చిరంజీవితో ఆ పని..!!
TeluguStop.com
మెగా ఫ్యామిలీ ( Mega Family ) ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంత మంచి హోదాలో ఉంది అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం చిరంజీవి.
ఈయన లేకపోతే మెగా ఫ్యామిలీ శూన్యం.ఇండస్ట్రీలో ప్రస్తుతం వారికి ఇన్ని గౌరవ మర్యాదలు ఉన్నాయంటే అది చిరంజీవి గొప్పతనం అని అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే చిరంజీవి ( Chiranjeevi ) తన నట వారసుడిగా రాంచరణ్ ని చిరుత సినిమా ద్వారా తీసుకువచ్చారు.
అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి తర్వాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
అయితే అలాంటి రామ్ చరణ్ కి తండ్రి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం అంటూ తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
"""/" /
అయితే వేలకోట్ల ఆస్తులు సంపాదించిన తండ్రి ప్రాణం కంటే రామ్ చరణ్ ( Ram Charan ) కి డబ్బే ముఖ్యమా అని మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ.
అయితే అసలు విషయంలోకి వెళ్లి చూద్దాం.రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెం.
150 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు 9 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ( Khaidi No 150 ) సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అయితే అలాంటి చిరంజీవి సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తూ తండ్రికి జ్వరం వచ్చినా కూడా సినిమాలో డబ్బు ఎక్కడ నష్టపోతామో అని చూసాడంటూ ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కానీ అసలు విషయం ఏమిటంటే.ఖైదీ నెంబర్ 150 సినిమాకు దర్శకుడుగా వివి వినాయక్ ( V.
V.Vinayak ) చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వివి వినాయక్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
చిరంజీవి అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం.ఓ రోజు చిరంజీవి ( Chiranjeevi ) కి జ్వరం వస్తే చాలా బాధపడిపోయారు.
తన తండ్రి కి తొందరగా తగ్గిపోవాలి అని దేవున్ని ప్రార్థించడం స్వయంగా నేను చూశాను అని అన్నారు.
కానీ దీనికి చిరంజీవి మాట్లాడుతూ అలాంటిదేమీ లేదు.ఒకవేళ నేను జ్వరం వచ్చి పడుకుంటే వాడి సినిమా ఎక్కడ నష్టపోతుందో అని భయం అని అన్నాడు.
"""/" /
దానికి వివి వినాయక్ మాట్లాడుతూ అలాంటిదేమీ లేదండి మీపై రామ్ చరణ్ ( Ram Charan ) కి ఎంతో ప్రేమ ఉంది అది అందరికీ తెలుసు అని అంటే ప్రేమ లేదు ఏం లేదు సినిమా హిట్ కాక నష్టం వస్తే వాడు తిట్టేది నన్నే కదా అంటూ చిరంజీవి ఫన్నీగా మాట్లాడారు.
అయితే ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కి డబ్బే ముఖ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు.
కానీ ఈ విషయాన్ని పట్టుకొని కొంతమంది రామ్ చరణ్ కి తండ్రి ప్రాణం కంటే డబ్బే ఎక్కువ అని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?