భారతీయుడు 2 చూసాక గేమ్ చేంజర్ కోసం స్పెషల్ కేర్ తీసుకోబోతున్న రామ్ చరణ్…
TeluguStop.com
ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్ తనకంటూ ఇక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇంతకు ముందు ఆయన చేసిన రంగస్థలం, త్రిబుల్ ఆర్ సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఆయన హీరోగా కొనసాగుతున్నాడు.
మరి ఇలాంటి క్రమంలోనే గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీని కోసమే ఆయన విపరీతమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు. """/" /
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన శంకర్ ఇండియన్ 2( Indian 2 ) సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కలిసి సినిమాకు సంబంధించిన పూర్తి సీన్స్ ను చూసి ఏవైనా బాగా రాకపోతే దానికి సంభందించిన రీ షూట్ పెట్టుకోవాలని చూస్తున్నారట.
ఇక ప్రస్తుతం శంకర్ ఏమాత్రం ఫామ్ లో లేడు అని అనిపిస్తున్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వస్తాడా అనే అభిప్రాయాలు కూడా వెలుబడుతున్నాయి.
"""/" /
మరి మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా అటు రామ్ చరణ్ కి, ఇటు శంకర్( Director S Shankar ) కి సూపర్ సక్సెస్ ని కట్టబెడుతుందా? అలాగే మెగా ఫ్యాన్స్ లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఇక ఈ సినిమా 2025 లో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక దాంతో పాటుగా ఇడియన్ 3 సినిమా కూడా 2025 లోనే రిలీజ్ చేస్తానని శంకర్ భారతీయుడు 2 సినిమా ఎండింగ్ లో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ రోల్ ను రిజెక్ట్ చేశారట.. పాపం ఇప్పుడు బాధ పడుతుంటారు!