చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?

రామ్ చరణ్( Ram Charan ) ఇటీవల అన్ స్టాపబుల్ కార్యక్రమంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక బాలకృష్ణ( Balakrishna ) ఎక్కువగా తన ఫ్యామిలీ గురించి కూడా రామ్ చరణ్ ని ప్రశ్నించారు.

గత ఎపిసోడ్లో తన తల్లి తన నాన్నమ్మ చరణ్ గురించి మాట్లాడుతూ ఒక వీడియోని ప్లే చేశారు.

అయితే ఈ ప్రోమో వీడియోలో భాగంగా తన ఇద్దరి సిస్టర్స్ చరణ్ గురించి మాట్లాడినటువంటి ఒక వీడియోని ప్లే చేశారు అంతేకాకుండా తన అక్క సుస్మిత( Susmitha ) చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా పంపించి చదవమని చెప్పారు.

"""/" / ఇక చారత్ గురించి తన అక్క సుస్మిత మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

చరణ్ తాము ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తనని చాలా మిస్ అవుతున్నామని తెలిపారు.

చరణ్ తో కలిసి సరదాగా గడిపి చాలా రోజులు అవుతుందని తన బిజీ షెడ్యూల్ కారణంగా తనతో కలిసి కాస్త సమయం గడపడానికి వీలు లేకుండా పోతుందని సుస్మిత ఎమోషనల్ అయ్యారు.

ఇక శ్రీజ( Sreeja ) సైతం చరణ్ గురించి మాట్లాడుతూ అన్నయ్య నాకు పిల్లర్ లాంటివాడు.

నాకు ఏదైనా కష్టం వస్తే ముందుండి ఆ కష్టం తీరుస్తాడని శ్రీజ సైతం తన అన్నయ్య చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

"""/" / ఇక సుస్మిత మాత్రం రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక లెటర్ పంపించడమే కాకుండా ఆ లెటర్ కచ్చితంగా చదవాలని కూడా తెలియజేశారు.

అయితే ఆ లెటర్ లో ఏముందనే విషయానికి వస్తే.చరణ్ 2025వ సంవత్సరంలో నువ్వు నేను శ్రీజ ముగ్గురం కలిసి ఏదైనా ఒక వెకేషన్ వెళ్లాలని కోరుకుంటున్నాను.

నా ఈ కోరికను కచ్చితంగా నెరవేరుస్తావని ఆకాంక్షిస్తున్నాను అంటూ సుస్మిత లెటర్ రాసి పంపారు.

ఈ లెటర్ చదివిన చరణ్ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అక్క అంటూ చెప్పేశారు.

ఇక ఇంట్లో మీ ముగ్గురు ఎలా ఉంటారు అంటూ బాలయ్య ప్రశ్నించడంతో చరణ్ మాట్లాడుతూ సుస్మిత అక్కకు కాస్త కోపం ఎక్కువ అందుకే అందరూ తనతో చాలా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు.

ఇక శ్రీజ ఎప్పుడు ఎవరిని నాకిది కావాలి అని అడగదు కానీ ఎవరైనా ఎక్కడికి వెళ్లిన తనకోసం పెద్ద ఎత్తున గిఫ్ట్ లు తీసుకువచ్చి తనకే ఇస్తారు.

అప్పుడే అర్థమైంది ఏమీ అడగకపోతే అన్ని ఇస్తారు అంటూ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా జీవితంలో దానికి తావు లేదు.. హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!