సగంలోనే వస్తానంటోన్న చరణ్.. ఆచార్యకు అదే ప్లస్ కానుందట!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని, ఈ సినిమాలో ఆయన ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాతో చిరు అదిరిపోయే విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.
ఆచార్య చిత్ర కథను మలుపు తిప్పే పాత్రగా ఇది ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.
అయితే ఈ సినిమా చరణ్ పాత్ర ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సమయంలో చరణ్ పాత్ర గురించి ప్రస్థావన వస్తుందని, ఆ సమయంలోనే చరణ్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.ఈ సీన్ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర ఏకంగా 25 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉంటుందట.అయితే ఇంకా ఆమె ఎవరనేది ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.
ఇక చిరు సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.