భార్యతో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న సమయంలో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటంతో ప్రస్తుతం కాస్త విరామం తీసుకున్నాడు చెర్రీ.

అలాగే చెర్రీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు.

అయితే చెర్రీ కి తాజాగా కాస్త విరామం దొరకడంతో తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసన విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లారు.ఈ క్రమంలో భాగంగా అందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .

అయితే ఈ హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేసిన తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇకపోతే రామ్ చరణ్ ఆర్ఆర్ ఆర్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

"""/" / రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో నటించారు.

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగిఉంటే జనవరి 7న విడుదల అయి ఉండేది.

అయితే చిత్రబృందం ఈ సినిమాను జనవరి 7న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో సినిమా విడుదల తేది దగ్గర పడటంతో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లతో ఫ్లెక్సీ లను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

కాని చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయడంతో చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

అంతేకాకుండా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా అవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గ్రీన్ టీలో ఇవి కలిపి రాశారంటే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది..!