మరో ఇంటర్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej)ఒకరు.

ఈయన టాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్( Global Star ) అనే ఇమేజ్ కూడా దక్కించుకున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

"""/" / ఈ విధంగా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ పలు అవార్డ్స్ అందుకోవడమే కాకుండా ఇప్పటికీ ఏదో ఒక అవార్డు ఈయనని వరిస్తూనే ఉంది.

ఇలా రామ్ చరణ్ తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు (International Award) అందుకోబోతున్నారని తెలుస్తుంది.

అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డు(Pop Golden Award) లలో భాగంగా రామ్ చరణ్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్( Golden Bollywood Actor ) అనే అవార్డు వరించింది.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇలా ఈయన ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులను అందుకోవడంతో అక్కడ కూడా చరణ్ పేరు మారుమోగిపోతుంది.

ఇలా గ్లోబల్ స్టార్ గా ఈయన మరింత గుర్తింపు సంపాదించుకుంటున్నారని చెప్పాలి.ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Game Changer) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే ఈయన బుచ్చిబాబు సినిమాలో పాల్గొనటానికి బిజీగా ఉన్నారు.

ఇక ఈయన నటించే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీల మోజు.. టాలీవుడ్ స్టార్స్ కార్ల ఖరీదెంతో తెలుసా?