”గేమ్ ఛేంజర్” అంత బ్యాలెన్స్ ఉందా.. కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.
ఆర్ఆర్ఆర్( RRR Movie ) ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్''( Game Changer ) ఒకటి.
"""/" /
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయనేలేదు.
ఇటీవలే దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టే ప్రకటించి మళ్ళీ వాయిదా వేశారు. """/" /
ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుంది.
కానీ ఇంకా ఎంత పూర్తి అయ్యిందో ఎంత బాలన్స్ ఉందొ ఎవ్వరికి తెలియక ఫ్యాన్స్ సతమతం అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూట్ పూర్తి అయ్యిందని మిగిలిన 20 శాతం షూట్ కంప్లీట్ కావాల్సి ఉందని కన్ఫర్మ్ చేసాడు.
ప్రస్తుతం ఈ షూట్ మైసూర్ లో చేస్తున్న విషయం తెలిసిందే.షూట్ పూర్తి అయితే కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వరు.
మరి ఎప్పటికి పూర్తి అవుతుందో చూడాలి.కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju )భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
భారత్ సంబంధాలు కీలకం : కెనడా కొత్త ప్రభుత్వానికి .. మాజీ దౌత్యవేత్త హితవు