పవన్ పొలిటికల్ పాత్రకు దగ్గరగా చరణ్ రోల్.. శంకర్ గట్టి ప్లాన్ వేసాడుగా!
TeluguStop.com
ప్రజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్''( Game Changer ) ఒకటి.
ఈయన గత సినిమా ఆర్ఆర్ఆర్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుని వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
శంకర్ ( Shankar )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి.
ఇక ఈ సినిమా కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
"""/" /
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అయ్యింది.
చరణ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.ఈ సినిమాలో రాజకీయ వ్యవస్థ లోని లోపాలను చూపించే విధంగా ఆ లోపాలు సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా ప్రస్తావించ బోతున్నారు.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ పాత్ర పవన్ కళ్యాణ్ నిజ జీవిత పాత్రకు దగ్గరగా ఉంటుందట.
"""/" /
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొలిటికల్ లైఫ్ ను ప్రేరణగా తీసుకుని కొన్ని సీన్స్ ను తెరకెక్కించారని సమాచారం.
మరి ఇదే నిజమైతే ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ గా తెరకెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయితే ప్రకంపనలే.
మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పవన్ కు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!