రామ్‌ చరణ్‌ అమెరికా ప్రయాణం.. అందుకోసమేనా

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ తెరకెక్కుతుంది.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను రాజమౌళి దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశాడు.

ఇప్పటికే కొన్ని సీన్స్‌ చిత్రీకరణ జరిపారు.ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు గాయాల బారిన పడ్డ కారణంగా సినిమాను షూటింగ్‌ వాయిదా వేసిన విషయం తెల్సిందే.

షూటింగ్‌ ఆలస్యం అయిన నేపథ్యంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లతో హడావుడిగా చిత్రీకరణ జరపాలని రాజమౌళి భావించాడు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో చిత్రీకరణ మొదలు పెట్టాడు.అయితే రెండు నెలల గ్యాప్‌ రావడంతో జిమ్‌కు దూరంగా ఉన్న రామ్‌ చరణ్‌ చాలా లావు అయ్యాడట.

దాంతో రాజమౌళి సినిమాను ప్రస్తుతానికి ఆపేద్దాం.మునుపటి బరువుతో తిరిగి వస్తేనే షూటింగ్‌ చేద్దాం అంటూ కండీషన్‌ పెట్టాడట.

దాంతో రామ్‌ చరణ్‌ బరువు తగ్గేందుకు సిద్దం అయ్యాడు.ఇక్కడ బరువు తగ్గాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

అందుకే చేసేది లేక అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే అమెరికాకు చరణ్‌ వెళ్లి పోయాడని, రామ్‌ చరణ్‌ మళ్లీ బక్కగా అయ్యి మాత్రమే వస్తాడేమో అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

రామ్‌ చరణ్‌ నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండి సన్నబడబోతున్నట్లుగా తెలుస్తోంది.రామ్‌ చరణ్‌ సన్నబడటం జరిగిన తర్వాత మళ్లీ సినిమా రీ షెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది.