Ram Charan Fan Siva Cherry: చెర్రీ వీరాభిమానిపై పచ్చి బూతులతో రెచ్చిపోతున్న పవన్ ఫ్యాన్స్.. కారణమిదే ?
TeluguStop.com
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ఆయన అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
పవన్ అభిమానులు పవన్ కోసం ఏం చేయడానికి అయినా కూడా సిద్ధమే అని చెప్పవచ్చు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే అది ఎవరైనా కూడా ఊరుకోరు.చివరికి మెగాస్టార్ చిరంజీవి నైనా సైతం లెక్కచేయరు పవర్ స్టార్ అభిమానులు.
ఇది ఇలా ఉంటే తాజాగా పవర్ స్టార్ అభిమానులకు ఒక విషయమే ప్రశ్న ఎదురయింది.
చిరంజీవా.లేకపోతే పవన్ కళ్యాణా? అనే ప్రశ్న వారికి ఎదురైంది.
జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణ( Rayapati Aruna ) చిరంజీవిని ఉద్దేశిస్తూ పరుష కామెంట్స్ చేశారు.
అసలు ప్రజారాజ్యం( Prajarajyam Party ) కాంగ్రెస్ లో విలీనం చేయడం పెద్ద తప్పు.
చిరంజీవి( Chiranjeevi ) నిర్ణయం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి శరాఘాతంలా మారింది.
ఆయన ఫెయిల్యూర్ పాత్ వేసిపోయారు.చిరంజీవి వలన రాష్ట్ర ప్రజలు నష్టపోయారు.
ఆయనకేమీ నష్టం లేదు.మరలా సినిమాలు చేసుకుంటున్నారు అని అన్నారు.
జనసేన వైఫల్యాలను( Janasena ) రాయపాటి అరుణ చిరంజీవి మీదకు నెట్టేశారని, రాజకీయాలు వదిలేసి తన పని తాను చేసుకుంటున్న చిరంజీవిని బ్లేమ్ చేయడం సరికాదని చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాయపాటి అరుణపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఆమె చిరు పై చేసిన వ్యాఖ్యలకు గాను వెంటనే చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాయపాటి అరుణకు అండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు.వైసీపీ నాయకులు పలుమార్లు చిరంజీవిని అవమానించారు.
"""/" /
అప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారని కౌంటర్లు స్టార్ట్ చేశారు.
అలా ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి ఫ్యాన్స్ అన్న రేంజ్ కి వెళ్ళిపోయింది.
వాడి వేడి వివాదం మధ్య రామ్ చరణ్ అభిమాని, పీఆర్వో అయిన శివ చెర్రీ( Shiva Cherry ) దూరాడు.
రాష్ట్ర చిరంజీవి యువత పేరున ఒక లెటర్ విడుదల చేశారు.రాయపాటి అరుణ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో ఉంది.
ఏకంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అడిగినా నేను క్షమాపణ చెప్పను అని రాయపాటి అరుణ వీడియోలు విడుదల చేశారు.
వివాదం శృతి మించుతుండగా నాగబాబు ( Nagababu ) ట్వీట్ చేశారు.మంటలు చల్లార్చే ప్రయత్నం చేశారు.
"""/" /
రాయపాటి అరుణ జనసేనకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు.ఆమె ఆవేశంలో నోరు జారి ఒక మాట అన్నారు.
అంతకు మించి దురుద్దేశం లేదు.రాయపాటి అరుణను నిందించడం ఆపాలంటూ సందేశం షేర్ చేశారు.
దాంతో శివ చెర్రీ చిరంజీవి రాష్ట్ర యువత పేరున ట్వీట్ చేసిన లేఖను డిలీట్ చేశారు.
ఈ వివాదం పెద్దది కావడానికి శివ చెర్రీనే కారణమని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వెనకా ముందు చూసుకోకుండా ట్వీట్స్ వేస్తావా? అసలు చిరంజీవి రాష్ట్ర యువత ఎవరు? నువ్వే ఆ లెటర్ పోస్ట్ చేశావని బండ బూతులు తిడుతున్నారు.
అతను మెగా ఫ్యామిలీ విధేయుడు దూషించడం తగదని నచ్చజెబుతున్నా వినడం లేదు.అలా అరుణ, చిరంజీవి వివాదంలో శివ చెర్రీ బలయ్యాడు.
వామ్మో, ఇదేంది.. ఇండియన్ ట్రైన్ ఎక్కి బ్రిటిష్ యూట్యూబర్ షాకింగ్ పని.. సిగ్గుపడాలంటూ!