ఎల్లలు లేని అభిమానం.. హీరోను కలవడానికి 264 కి.మీ.కాలినడక

సినీ హీరోలపై ప్రజలకు ఉండే అభిమానం వెలకట్టలేనిది.వెండితెరపై తమ అభిమాన హీరో కనిపించగానే కాగితాలు, పూలు చల్లుతుంటారు.

థియేటర్ల బయట ఆ సినిమా 'తొలి షో'కు ముందుగానే భారీ కటౌట్లు పెడుతుంటారు.

వాటికి పూలదండలు వేసి, పాలాభిషేకం కూడా చేసేస్తుంటారు.ఇక కొందరు అభిమాన తారలకు గుడి కట్టిన వార్తలను కూడా మనం విన్నాం.

ఇంతలా సినీ తారలపై తమకున్న వీరాభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తమ హీరోలకు మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని ఓ సాహసం చేశాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.జైరాజ్ అనే యువకుడు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.

ఆయనది తెలంగాణలో గద్వాల్‌ జిల్లాలోని గోర్లఖాన్ దొడ్డి స్వస్థలం.మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అంటే ఆయనకు చాలా ఇష్టం.

హీరో రామ్ చరణ్‌ను ఎంతో ఆరాధిస్తుంటాడు.చరణ్ సినిమా విడుదలైందంటే చాలు మొదటి రోజు మొదటి షో చూసేయాల్సిందే.

ఆయన పేరుతో చాలా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాడు.ఇక జైరాజ్‌కు అరెకరం పొలం ఉంది.

ఇటీవల దానిలో కర్నూలు సోనామసూరి రకం వరి పండించాడు.అందులో ఏం వింత ఉందని అనుకుంటున్నారా.

ఇక్కడే జైరాజ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.రామ్ చరణ్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా వరి నాట్లు నాటాడు.

"""/" / పంట పూర్తవగానే రెండు బస్తాల నిండా బియ్యాన్ని తీసుకుని, కాలి నడకన స్వస్థలం నుంచి బయలు దేరాడు.

ఏకంగా 264 కిలో మీటర్ల దూరం కాలినడక వచ్చాడు.చివరికి హైదరాబాద్‌లో రామ్‌చరణ్‌ను ఆయన స్వగృహంలో కలుసుకున్నాడు.

ఎంతో ప్రేమతో తాను పండించిన ధాన్యాన్ని అభిమాన హీరోకు అందించాడు.దాంతో పాటు రామ్ చరణ్ చిత్రాన్ని వడ్ల గింజలతో రూపొందించి, దానిని హీరోకు ఇచ్చాడు.

అభిమాని అందించిన బహుమతులతో రామ్ చరణ్ సంతోషంలో మునిగిపోయాడు.ఇలాంటి అభిమానులు ఉన్నందుకు తాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు రామ్ చరణ్ తెలిపాడు.

అభిమానిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఇంట్లో అతడితో కలిసి భోజనం చేశాడు.అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు.

నాన్నను అలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!