ఆచార్యలో చరణ్ ఏడిపిస్తూ వస్తాడట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడనే టాక్ గతకొంత కాలంగా వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆయన ఎంట్రీ ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్ కానుందని చత్ర యూనిట్ అంటోంది.

ఇక ఇంటర్వెల్‌లో చరణ్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతుందని, ముఖ్యంగా ఓ ఎమోషనల్ నోట్‌తో చరణ్ ఇచ్చే ఎంట్రీ అదిరిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో చరణ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఏదేమైనా ఆచార్య చిత్రంలో చరణ్ ఎంట్రీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమాలో చరణ్ చేయబోయే పాత్ర సినిమాకు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆచార్య సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

వైరల్ న్యూస్: 760 ఏళ్ల జైలు శిక్షణ విధించిన కోర్టు.. అసలు మ్యాటరేంటంటే..