రూ.కోటి విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచిన చరణ్.. మెగా ఫ్యామిలీ మొత్తం విరాళం ఎంతంటే?
TeluguStop.com
సహాయం చేసే మంచి మనస్సు కొంతమందికి మాత్రమే ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా సాయం చేసే మంచి మనస్సు ఉన్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ ముందువరసలో ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ( Ram Charan )దాతృత్వాన్ని చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అటు ఏపీ, ఇటు తెలంగాణ వరద బాధితులకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు రామ్ చరణ్ ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
రామ్ చరణ్ విరాళం ప్రకటించడంతో పాటు చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇదేనని చరణ్ తెలిపారు.
"""/" /
నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నానని చరణ్ చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల ( Telugu States)ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని రామ్ చరణ్ వెల్లడించారు.
రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.చరణ్ సేవా భావాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
"""/" /
రామ్ చరణ్ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మెగా ఫ్యామిలీ మొత్తం 8 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం గమనార్హం.
పవన్ ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించగా చిరంజీవి కోటి రూపాయలు, చరణ్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ( Game Changer )సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితం కాగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!