చరణ్ పై మనసు పారేసుకుంటున్న అమెరికన్ మహిళలు!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ముఖ్యంగా చరణ్ నటించిన రామరాజు పాత్ర మరింత ఆదరణ పొందింది అనే చెప్పాలి.

బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా రామరాజు పాత్ర సరికొత్తగా కనిపించడంతో ఎన్టీఆర్ కంటే కాస్త ఎక్కువే చరణ్ కు ఫాలోయింగ్ వచ్చింది.

అయితే ఇక్కడ మాత్రమే కాదు అమెరికాలో కూడా చరణ్ పాత్రకు భారీ స్పందన వచ్చింది.

అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ కు మంచి ఆదరణ లభించింది. """/" / అక్కడి పాపులర్ మ్యాగజైన్ ఇన్ సైడర్ కరస్పాండెంట్ కిర్ స్టెన్ అకునా.

కూడా చరణ్ కు వీరాభిమానిని అంటూ ట్వీట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది.

చరణ్ తన కొత్త క్రష్ అంటూ చెప్పుకొచ్చింది.ఈమెనే కాదు చాలా మంది ఈమె చేసిన పోస్ట్ కు రియాక్ట్ అవుతూ చరణ్ తమ హృదయాన్ని దోచిన నటుడు అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు అందరిని ఆకట్టు కుంటుంది.

రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్రకు ఇంత ఆదరణ దక్కడం సంతోషించాల్సిన విషయం.

చరణ్ ఇంట్రడక్షన్ సీన్, చివరిలో యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా పలు అంశాలు చరణ్ ను హాలీవుడ్ లో ఫేవెరెట్ స్టార్ గా చేసాయి.

ఇక ఇంత ఆదరణ లభించడంతో త్వరలోనే చరణ్ కూడా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తాడా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

మరి ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

అప్పుడు టీడీపీలో ఇప్పుడు వైసీపీలో … వణికిపోతున్నారే ?