కృష్ణుడి పూజలో కొణిదెల క్లీంకార.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే!

తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి ( Shri Krishna Janmashtami )సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల ( Celebrities )వరకు ప్రతి ఒక్కరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

కృష్ణాష్టమి జన్మ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన కూడా తాజాగా కృష్ణుడి పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. """/" / చరణ్‌ ,ఉపాసన ( Charan, Upasana )ముద్దుల కూతురు క్లీంకారా ( Klinkara )కృష్ణుడి పూజలో పాల్గొంది.

పూజ గదిలో కూర్చున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది.

ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పాప ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

కాగా ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు మెగా కోడలిగా బాధ్యతలను చూసుకుంటోంది.

"""/" / అలాగే తనకు తన భర్తకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఉపాసన.

అలాగే భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటూ ఉంటుంది.

ఉపాసన మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.ఎంతోమందికి సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది ఉపాసన.

మూడు తరాల నమ్మకం అంటున్న ఎన్టీఆర్!