కౌబాయ్ లా మారిన చరణ్.. పక్కన కౌగర్ల్ కూడా ఉందిగా..పిక్ వైరల్!

మెగా కుటుంబం నుండి మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.

ఈయన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.

ఇక ఈయన ప్రెజెంట్ భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.ఈయన ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి జరిగి పదేళ్లవుతున్న ఈ జంట అన్యోన్యత ఎప్పుడు ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీస్తూనే ఉంటుంది.

రామ్ చరణ్ స్టార్ హీరోగా బిజీగా ఉంటే.ఉపాసన కూడా అపోలో బాధ్యతలు తీసుకుని సక్రమంగా నిర్వర్తిస్తుంది.

వీరిద్దరూ ప్రెజెంట్ టాంజానియా ట్రిప్ లో ఉన్నారు.ఇక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా మరొక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసింది.ఈ ఫొటోలో ఇద్దరు కూడా కౌబాయ్ గెటప్ లో ఉన్నారు.

సేమ్ ఇద్దరు ఒకే కాస్ట్యూమ్ లో హ్యాట్, గాగుల్స్ తో స్పెషల్ గా కనిపిస్తున్నారు.

ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కౌబాయ్ తో ఈ కౌగర్ల్ ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.

"""/"/ ఇక ఈ జంట నిన్ననే హైదరాబాద్ కు విచ్చేసారు.మరొక వారంలోనే రామ్ చరణ్ ఆర్సీ 15 షూటింగులో జాయిన్ అవ్వనున్నాడు.

టీమ్ అంతా న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే షూటింగ్ చేయనున్నారు.శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఆర్సీ 16 సినిమా గురించి కూడా కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది.

ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి తో క్యాన్సిల్ అవ్వడంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..