మీ ఆస్కార్ ని ఒక్కసారి టచ్ చేయనివ్వండి.. రామ్‌ చరణ్ తో షారుఖ్‌

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు లో ట్రైలర్ ని రామ్ చరణ్ ప్రేక్షకులకు అందించాడు.తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేసినందుకుగాను షారుఖ్‌ ఖాన్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.షారుక్ ఖాన్ ట్విట్టర్ లో పఠాన్ సినిమా యొక్క ట్రైలర్ విడుదల చేసినందుకు కృతజ్ఞతలు.

మీరు సాధించబోతున్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును నన్ను ఒక సారి టచ్ చేయనివ్వండి అంటూ ఒక చిన్న పిల్లాడి మాదిరిగా షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

పైగా ఆయన తెలుగు లో ఆ ట్వీట్ ని చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.

బాలీవుడ్ బాద్షా అయ్యి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆయన యొక్క గొప్పతనం అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

"""/"/ సోషల్ మీడియా లో రామ్ చరణ్ మరియు షారుక్ ల మధ్య జరిగిన సంభాషణలో తాలూకు స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక షారుక్ పఠాన్ సినిమా విషయానికి వస్తే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించింది.

"""/"/ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఇక చరణ్ ప్రస్తుతం యూఎస్ లో ఆర్‌ ఆర్ ఆర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మరియు స్క్రీనింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

ఉద్యోగుల కోసం ఆఫీస్‌లో 10 పిల్లులను పెంచుతున్న జపనీస్ టెక్ కంపెనీ..