చరణ్‌, శంకర్‌ మూవీలో ఆ సూపర్‌ స్టార్‌ నటించబోతున్నాడట!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించబోతున్న భారీ చిత్రం కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శర వేగంగా జరుపుకుంటుంది.

ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ను జులై నుండి చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

అయితే ఇండియన్ 2 ను శంకర్‌ మళ్లీ మొదలు పెడితే చరణ్‌ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దాంతో చరణ్‌ మూవీ గురించిన ప్రతి విషయం కూడా అందరికి ఆసక్తిగా మారింది.

చరణ్‌ మరియు శంకర్ ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా కు కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమా లో కీలక పాత్రను కన్నడ స్టార్‌ సుదీప్‌ తో చేయించాలనే నిర్ణయానికి వచ్చారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ స్టార్‌ హీరో సుదీప్ ను ఈ సినిమా కోసం ఇప్పటికే శంకర్ సంప్రదించాడని ఆయన వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.

సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది.కనుక ఆయన ఈ సినిమా కోసం శంకర్ తీసుకున్నాడు.

గతంలో సుదీప్ తెలుగు లో నటించి మెప్పించాడు.కనుక ఈ సినిమా లో కూడా ఆయన తెలుగు వారిని మెప్పిస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో శంకర్ దర్శకత్వం లో దిల్‌ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా భారీగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు ఈ సినిమా కు సంబంధించిన కీలక పాత్రల నటీ నటుల ఎంపిక విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా లో మరింత మంది ప్రముఖ నటీనటులు నటించబోతున్నారో అనే చర్చ కూడా మొదలైంది.

కలకత్తా విజయానికి కారణాలు ఇవే..మరి సెమీస్ కి వెళ్తుందా..?