హైకోర్టు తీర్పుతో రామ్‌చరణ్ 15 స్పీడ్ పెరుగనుందా?
TeluguStop.com
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ను చేస్తున్నాడు.వచ్చే నెలతో ఆ సినిమా పూర్తి అవుతుందని అంతా అంటున్నారు.
ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం లో చరణ్ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.
కాని ఇటీవల ఆ సినిమా గురించి నీలి నీడలు కమ్ముకున్నాయనే పుకార్లు షికార్లు చేశాయి.
రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ దక్కింది.
మద్రాస్ హై కోర్టు తీర్పుతో శంకర్ ఫ్రీ బర్డ్ అయ్యాడు.ఇండియన్ 2 ముగించకుండా శంకర్ మరే సినిమా ను కమిట్ అవ్వొద్దు అంటూ లైకా వారు వేసిన పిటీషన్ ను మద్రాస్ కోర్టు కొట్టి వేసింది.
మీకు ఇచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకోలేదు.ఒక దర్శకుడు ఎంత కాలం అంటూ ఒకే మూవీ ని చేస్తూ ఉంటాడు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
అందుకే లైకా వారి నుండి శంకర్ కు ఉపశమనం లభించింది.ఆ వివాదం లో క్లారిటీ రావడంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ వెంటనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ను ఈ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలు పెట్టబోతున్నారు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
"""/"/ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా లను తెరకెక్కించిన శంకర్ దర్శకత్వం లో చరణ్ మూవీ అంటూ ఇప్పటికే మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇప్పుడు ఈ కోర్టు తీర్పుతో వారు ఆనందంగా ఉన్నారు.స్క్రిప్ట్ వర్క్ మద్యలో ఉండటంతో త్వరలోనే దాన్ని పూర్తి చేయబోతున్నారు.
మరో వైపు ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ ల నిర్మాణంను కూడా మొదుల పెట్టబోతున్నారు.
ఈ సినిమా నిర్మాణం విషయంలో త్వరలోనే దిల్ రాజు నుండి ఒక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!