ఆర్‌సీ15... రేపటి నుండి మళ్లీ మొదలు పెట్టనున్న శంకర్‌

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొందింది.అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించి అద్భుతంగా ఉన్నాడు అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు.

విమర్శకుల ప్రశంసలు దక్కిన ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా ఏదైనా కూడా అంచనాలను భారీగా మోయాల్సి ఉంటుంది.

ఇప్పుడు రామ్ చరణ్ తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు రెగ్యులర్ గా సాగుతూనే ఉన్నాయి.ఇటీవల శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కార్యక్రమాల కోసం చెన్నై వెళ్లి పోయాడని, మూడు నాలుగు నెలల వరకు మళ్లీ రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టే అవకాశం లేదని ప్రచారం జరిగింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుండి రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్‌ లో సినిమా హైదరాబాదులో పునః ప్రారంభం కాబోతుంది.

హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో కూడా ఈ షెడ్యూల్ నిర్వహించబోతున్నారు.దాదాపు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని.

అంటే ఈ నెల చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని.ఆ తర్వాత మళ్లీ చెన్నై వెళ్లి ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఒక వైపు ఇండియన్ 2 సినిమా చేస్తూనే మరో వైపు రాంచరణ్ సినిమా చేస్తున్న దర్శకుడి శంకర్‌ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో అంటూ మెగా అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ కానీ మెగా అభిమానులకు ఆందోళన అవసరం లేదని దర్శకుడు శంకర్ ఒక అద్భుతమైన సినిమా ను రాంచరణ్ కి అందించబోతున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అతి త్వరలోనే రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతుంది.

ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అన్నారు.

కానీ కాస్త అటు ఇటుగా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!