చరణ్‌, కొరియన్‌ నటి రొమాన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబినేషన్‌ లో దిల్‌ రాజు నిర్మించబోతున్న సినిమా జులై లేదా ఆగస్టులో పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఈ సినిమా లో హీరోయిన్ విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్‌ పుకారు ఒకటి షికారు చేసింది.

ఈ సినిమాలో కొరియన్ నటి బే సుజీని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

సినిమాలోని కీలక పాత్ర కోసం ఆమెను భారీ పారితోషికం ఇచ్చి మరీ నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.ఆ విషయంలో ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు పూర్తిగా అబద్దం అని తేలిపోయింది.

"""/"/ ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు నిజమో కాదో తెలియదు కాని బే సుజీని ఈ సినిమా లో నటింపజేస్తున్న విషయం మాత్రం నిజం కాదని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

కథలో విదేశీ నటికి అవకాశం లేదని కొందరు అంటున్నారు.మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ దిల్‌ రాజు టీమ్‌ వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

శంకర్‌ సినిమా అంటే విదేశీ టెక్నీషియన్స్‌ తో పాటు విదేశీ నటులు ఉండటం సాధ్యమే.

కనుక ఇప్పటికి కూడా బే సుజీని ఈ సినిమాలో నటింపజేస్తున్నారేమో అంటూ కొందరు నమ్ముతున్నారు.

ఈ విషయంలో చాలా మంది శంకర్‌ నుండి స్పందన కోరుతున్నారు.ఇండియన్ 2 సినిమా ను మళ్లీ మొదలు పెట్టే ఉద్దేశ్యంలో ఉన్న శంకర్‌ ఎప్పుడు చరణ్‌ తో మూవీని మొదలు పెడతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా తో పాటు ఆచార్య ను కూడా చేస్తున్నాడు.ఈ రెండు సినిమా ల తర్వాత శంకర్‌ దర్శకత్వం లో చరణ్‌ మూవీ పట్టాలెక్కబోతుంది.

తెలంగాణ క్యాబినెట్ ను విస్తరిస్తున్నారా ? వీరికేనా ఛాన్స్ ?