గేమ్ ఛేంజర్ విషయంలో టెన్షన్ పడుతున్న దిల్ రాజు

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా ప్రముఖ తమిళ్ దర్శకుడు శంకర్( Shankar ) దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికి విడుదల అవ్వాల్సి ఉంది.

కానీ దర్శకుడు శంకర్ బిజీగా ఉండటం వల్ల, రామ్ చరణ్ ఆ మధ్య సెలవులు తీసుకోవడం వల్ల విడుదల ఆలస్యం అవుతూ ఉందని సమాచారం అందుతోంది.

ఏదైనా సినిమా విడుదల ఆలస్యం అయినా కొద్ది నిర్మాతకు భారం పెరుగుతూనే ఉంటుంది.

బడ్జెట్‌ విపరీతంగా పెరగడంతో పాటు ఆ బడ్జెట్‌ కి సంబంధించిన వడ్డీలు కూడా పెరుగుతూనే ఉంటాయి.

ఏ సినిమా అయినా ఫైనాన్స్ తీసుకుని మాత్రమే నిర్మిస్తూ ఉంటారు. """/" / కనుక గేమ్ ఛేంజర్‌( Game Changer Movie ) కోసం తీసుకున్న ఫైనాన్స్ కూడా భారీగా వడ్డీ లు పెరుగుతున్న కారణంగా ఏం చేయాలో పాలు పోవడం లేదని దిల్‌ రాజు జుట్టు పీక్కుంటున్నాడు.

శంకర్ తో ముందస్తు గానే ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా ను ముగించాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది.

కానీ పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే ఏడాది సమ్మర్‌ కి అయినా గేమ్‌ ఛేంజర్ వస్తుందా లేదా అనే అనుమానం కలుగుతోంది.

"""/" / ఇప్పటి వరకు గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ విషయం లో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఎప్పటికి సినిమా షూటింగ్ ని ముగించేది కూడా మేకర్స్ నుండి స్పష్టత రావడం లేదు.

దాంతో దిల్ రాజు కి ( Dil Raju ) భారీ మొత్తం లో నష్టాలు తప్పదేమో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌ తో సినిమా రూపొందుతోంది.

పైన పెరిగే ఖర్చులు అన్నీ కలిపి లాభాలు రావాలి అంటే గేమ్ ఛేంజర్ సినిమా తో దిల్ రాజుకి రూ.

500 కోట్లు రావాల్సి ఉంది.అప్పుడే సినిమా కి లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?