ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ కే ఆ అరుదైన ఘనత దక్కబోతుందా?
TeluguStop.com
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది.రాజమౌళి దయ తో తెలుగు సినిమా పరిశ్రమలో రూపొందుతున్న ప్రతి ఒక్క సినిమా ను కూడా పాన్ ఇండియా సినిమా అంటూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా తమ సినిమాలను విడుదల చేసేందుకు యంగ్ హీరోల నుండి సీనియర్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే చాలా దూరం వెళ్ళి పోయాడు.ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్నాయి.
అందుకే ఆయన ఏ సినిమా చేసినా కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
"""/"/
తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ప్రభాస్ అనడంలో సందేహం లేదు.
తాజాగా ఆ జాబితాలో మరో హీరో చేరాడు.రామ్ చరణ్ ఇటీవల కమిట్ అయిన ఒక సినిమా కు గాను ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దక్కించుకున్నాడట.
బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అందుకనే ఈ సినిమా కు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.రామ్ చరణ్ మరియు ప్రభాస్ లు మాత్రమే ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
మహేష్ బాబు చాలా సంవత్సరాలుగా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.మహేష్ బాబు కూడా అతి త్వరలోనే రూ.
100 కోట్ల రెమ్యూనరేషన్ కు చేరుకునే అవకాశం ఉంది.
ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?