జపాన్ లో ఆ విషయమై పోటీ పడుతున్న అల్లూరి, భీమ్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఆ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జపాన్ లో జరుగుతున్నాయి.

ఇండియా లో మరియు వివిధ దేశాల్లో విడుదల అయ్యి వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ల ను నమోదు చేసిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ లో అక్కడి స్థానిక భాష లో విడుదల చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.జపాన్ లో ఈ సినిమా ను విడుదల చేయడానికి మంచి స్కోప్ ఉన్నందున పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేసేందుకు గాను ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు రాజమౌళి అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.

అక్కడ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క స్టయిలింగ్ చూస్తూ ఉంటే స్థానిక జపనీస్ నోరు వెళ్ళ బెట్టేలా ఉంది అనడం లో సందేహం లేదు.

రెండవ రోజు ఎన్టీఆర్ మరియు రాం చరణ్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

ఇద్దరి స్టైలిష్ లుక్ పోటా పోటీగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. """/"/ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో మీడియా ముందు కూర్చున్న సమయం లో అందరూ కూడా నోరు వెళ్ళ బెట్టి వారిద్దరి యొక్క స్టైల్ మరియు మేనరిజంను చూస్తున్నారట.

ఇద్దరికీ కూడా మంచి స్పందన లభిస్తుంది, ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారంటూ అక్కడి వారు మాట్లాడుకోవడం జరిగింది.

మొత్తానికి మన హీరోలు జపాన్ లో కూడా సత్తా చాటుతున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా యొక్క వసూళ్లు అక్కడ ఎలా ఉన్నా కూడా భారీ గా పబ్లిసిటీ దక్కి అస్కార్ బరిలో నిలిచే అవకాశం రావాలని జక్కన్న టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇంటి చిట్కాల‌తో మ‌ల‌బ‌ద్ధ‌కం మ‌టాష్‌..!